ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు నమ్మించడానికి ఎన్ని ప్రకటనలు చేసిన ఆయను మాదిగ జాతి నమ్మే పరిస్థితి లేదు అన్నారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. పార్సిగుట్టలో మాట్లాడిన మందకృష్ణ…రేవంత్ రెడ్డినీ మాదిగల ద్రోహిగానే పరిగణిస్తాం అన్నారు.
నిన్న ఎస్సీ రిజర్వేషన్ లు అమలుచేయకుండానే 11వేల ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేశారు అన్నారు. వర్గీకరణ తర్వాతనే కొత్త నోటిఫికేషన్లు అని కొత్త పాట పాడుతున్న సిఎం..గతంలో వర్గీకరణ తర్వాతనే నోటిఫికేషన్లు వర్తింపజేసిన తర్వాతనే నియమకాలు అని శాసనసభలో మాట్లాడారు..దానికే విలువలేదు…బయట మాట్లాడిన దానికి విలువ ఎక్కడ ఉంటుంది..? అన్నారు.
రేవంత్ రెడ్డిని నమ్మేది లేదు..వదిలేది లేదు…నిన్న శాంతియుత నిరసన ర్యాలీ చేసి..అంబేద్కర్ కు వినతిపత్రం అందజేస్తామంటే పర్మిషన్ ఇవ్వలేదు అన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిర్భందాలతోనే నడుస్తుంది..వర్గీకరణ చట్టంలో వర్గీకరణ జరిగే నాటికి ఉన్న ఉద్యోగాలకు కూడా వర్గీకరణ అమలుచేయాలన్నారు. గ్రూప్ – 1 కు వర్గీకరణ వర్తింపజేయాలి…లేదా వర్గీకరణ తరవాతనే గ్రూప్ -1 పరీక్షలు నిర్వహించాలి…గ్రూప్ – 2 పరీక్షలు వర్గీకరణ చట్టం అయిన తర్వాతనే నిర్వహించాలన్నారు. గ్రూప్ – 3 పరీక్షలు కూడా నిలుపుదల చేయాలి..వర్గీకరణ చేయకుండా గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -3 పరీక్షలు నిర్వహిస్తే నష్టపోయేది మా కుటుంబాలు, మా కులాలు అన్నారు.
గ్రూప్ – 4 ఫలితాలు 16నెలలు ఆగాయి, వర్గీకరణ జరిగే వరకు మరో రెండు నెలలు ఆపండి ..తమ సామాజిక వర్గానికి చెందిన మంత్రి దామోదర నరసింహ శాఖలో అత్యధిక నోటిఫికేషన్ లు వర్గీకరణ రిజర్వేషన్ లేకుండానే ఇచ్చారు అన్నారు. వర్గీకరణ చట్టం మా చేతికి వచ్చేంత వరకు రేవంత్ రెడ్డిని నమ్మేది లేదు ప్రజల్లోనే ఉంటాం…పోరాటం చేస్తాం అన్నారు. ఈనెల 16న వరంగల్ లో భారీ సమావేశం నిర్వహిస్తాం..అన్ని కమిటీల సభ్యులు పాల్గొంటారు..ఇప్పటి వరకు ఆవేదనతోనే నిరసన చేశాం, ఇకపై మా ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది..దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు.
Also Read:హ్యాపీ బర్త్ డే..నవ్వుల రాజు అలీ