బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది టీమిండియా. మూడు టీ20ల సిరీస్‌ను 2-0 తేడాతో దక్కించుకుంది. బుధవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో గెలుపొందింది.
భారత్ విధించిన 222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కొల్పోయి 135 పరుగులు మాత్రమే చేసింది. మహమ్మదుల్లా 41,హొస్సేన్ 16,దాస్ 14,హసన్ మీరాజ్ 16 పరుగులు చేశారు. భారత బౌలర్లలో నితీశ్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి తలో రెండు వికెట్లు తీయగా అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్‌లు ఒక్కో వికెట్ తీశారు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 221 పరుగుల భారీ స్కోరు సాధించింది. సంజూ శాంసన్ (10), అభిషేక్ శర్మ (15), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (8) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. దీంతో భారత్ పవర్ ప్లేలో భారత్ 41/3తో నిలవగా ఈ దశలో క్రీజులోకి వచ్చిన హైదరాబాది కుర్రాడు నితీశ్ రెడ్డి ఆకాశమే హద్దుగా చెలరేగగా దీనికి రింకూ సింగ్ కూడా జతకావడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
Also Read:KTR: రాహుల్ జీ..అశోక్‌నగర్ ఎప్పుడు వస్తున్నారు?
ముఖ్యంగా నితీశ్ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 34 బంతుల్లో 7 సిక్స్‌లు,7 ఫోర్లతో 74 పరుగులు, రింకూ సింగ్ 29 బంతుల్లో 3 సిక్స్‌లు, 5 ఫోర్లతో 53 పరుగులు చేయగా హార్ధిక్ పాండ్యా 32 పరుగులు చేశాడు. నితీశ్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా మూడో టీ20 అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా జరుగనుంది.