Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్‌నే నవ్వించిన అవినాష్‌-రోహిణి

6
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 38 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి సభ్యులకు ఫన్నీ టాస్క్‌లు ఇచ్చి నవ్వులు పూయించాడు బిగ్ బాస్. తొలుత ఈ ఇల్లు సమానంగా రెండు భాగాలు.. అమ్మాయిలు అబ్బాయిలుగా విభజించబడుతుందని చెప్పాడు బిగ్ బాస్. ఈ రెండు గ్రూపుల్లో ఎక్కువగా ఎవరు ఎంటర్‌టైన్ చేస్తారో చూస్తాం.. అమ్మాయిల లీడర్ అవినాష్.. అబ్బాయిల లీడర్ రోహిణి మొదటి రౌండ్‌లో నవ్వకుండా ఉండటానికి ప్రయత్నించాలన్నారు. టీమ్ సభ్యులు అందరూ వారి నోటిని నీటితో నింపుకోవాల్సి ఉంటుందని.. ఎదుటి టీమ్ నుంచి ఒకరు వచ్చి జోక్స్ చెప్పి వారిని నవ్వించి నోటిలో నీటిని బయటికొచ్చేలా చేసి ఔట్ చేయాలని తెలిపాడు బిగ్ బాస్.

దీంతో అమ్మాయిలంతా నోటిలో నీళ్లేసుకొని రెడీ అయిపోయారు. ఇక అబ్బాయిల టీమ్ లీడర్ అయిన రోహిణి నవ్వించడానికి ప్రయత్నించింది. యష్మీ ఆ మూతి ఎంత బావుందో తెలుసా.. ఆ మచ్చ మడతల్లోకెల్లి అంటూ ఏదేదో ట్రే చేసింది కానీ యష్మీ నవ్వలేదు. ఇక గంగవ్వను కూడా సీరియస్‌గా ట్రే చేసింది కానీ వర్కవుట్ కాలేదు. ఇంతలో బజర్ మోగింది.

తర్వాత అబ్బాయిలంతా రెడీ అవ్వగా అమ్మాయిల టీమ్ లీడర్ అవినాష్ నవ్వించడానికి వచ్చాడు. మణికంఠ దగ్గరికెళ్లి.. అఖిల బ్రహ్మాండకోటి అంటూ తననే ఇమిటేట్ చేశాడు..దీంతో నవ్వు ఆపుకోలేక ఔట్ అయిపోయాడు మణి. ఆ తర్వాత గౌతమ్ దగ్గరికెళ్లి నవ్వించడానికి ట్రై చేశాడు అవినాష్. ఇంతలో స్టేజ్ దిగిపోయి.. సరేసరే బ్రో ఒన్ సెకండ్ అంటూ అరిచాడు గౌతమ్. సీజన్ 7లో అయిపోయింది అది మళ్లీ మళ్లీ తీసి నాకు ఇరిటేషన్ తెప్పించకు బ్రో అంటూ గౌతమ్ సీరియస్‌గా మైక్ కింద పడేసి గౌతమ్ లోపలికి వెళ్లిపోయాడు. ఇక దీనికి హర్ట్ అయిన అవినాష్.. నేను స్టార్టింగ్‌లోనే ఎవరూ హర్ట్ అవ్వొద్దని చెప్పా ఈ టాస్కు ఆడను బిగ్‌బాస్ అంటూ అవినాష్ కూడా సీరియస్ అయ్యాడు.అవినాష్ సహా అందరూ గౌతమ్ దగ్గరికెళ్లి ఓదార్చారు.

Also Read:Bigg Boss 8 Telugu: అందరి టార్గెట్ యష్మీనే

కాసేపటి తర్వాత అవినాష్-రోహిణిలకి స్పెషల్ టాస్కు ఇచ్చాడు బిగ్‌బాస్. అవినాష్ రోహిణి ఇద్దరూ కలిసి బిగ్‌బాస్‌ని నవ్వించాల్సి ఉంటుంది.. అంటూ బిగ్‌బాస్ అన్నాడు. దీంతో ఇన్ని సీజన్లలో ఎప్పుడైనా నవ్వారా అసలు అంటూ అవినాష్ కౌంటర్ వేశాడు. బిగ్‌బాస్ సొంత ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూపించేందుకు ఓ స్కిట్ చేశారు. బిగ్‌బాస్‌లా అవినాష్.. ఆయన భార్యలా రోహిణి యాక్ట్ చేశారు. వీరిద్దరి టాస్క్‌కు ఇంప్రెస్ అయిన బిగ్ బాస్ స్పెషల్ రివార్డ్ ఇచ్చారు.

- Advertisement -