KTR: యువతను పిచ్చోళ్లను చేస్తున్న రేవంత్!

4
- Advertisement -

ఈ ముఖ్యమంత్రిని చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడని అనిపిస్తుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్…నియామకాలపై మరీ ఇంత నీతిమాలిన ప్రచారమా..? అని ప్రశ్నించారు.

ప్రజా ధనాన్ని తగలేసి…ఫ్రంట్ పేజీల్లో పచ్చి అబద్ధాలతో ప్రకటనలా..?,గత ప్రభుత్వ ఉద్యోగాలను కాంగ్రెస్‌ ఖాతాలో వేసుకోవడానికి కొంచెమైనా సిగ్గుండాలి కదా..! అని ప్రశ్నించారు. తెలంగాణ యువత ను పిచ్చోళ్లను చేస్తున్నావా…? ,అశోక్ నగర్ చౌరస్తాకు..ఉస్మానియా క్యాంపస్‌కు పోయి చెప్తవా నీ కొలువుల పండుగ కథలు..? అన్నారు కేటీఆర్. ఏడాదిలో 2 లక్షల కొలువులు గ్యారెంటీఅని.. నిరుద్యోగుల చెవుల్లో పువ్వులు పెట్టింది చాలక..తప్పుడు లెక్కలతో తప్పుదోవ పట్టించడం దుర్మార్గం అన్నారు.

Also Read:ఉత్తమ ప్రాంతీయ చిత్రం కార్తికేయ 2

- Advertisement -