మునగ చెట్టు గురించి తెలియని వారు ఉండరు. ఇందులోని ఆకులు, బెరడు, కాయలు, పూత.. ఇలా ప్రతి దాంట్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ చెట్టు యొక్క కాయలతో రుచికరంగా కర్రీ, పచ్చడి, వేపుడు.. ఇలా ఎన్నో రకాల వంటకాలు తయారు చేసుకొని అరగిస్తుంటాము. ఇంకా మునగ ఆకులను కూడా కొంతమంది కూరాలలో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మునగ చెట్టులోని ప్రతిదీ కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలకు దివ్యౌషధంలా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
మునగాకుతో చేసిన లడ్డును తినడం ద్వారా జుట్టు రాలే సమస్యను తగ్గించవచ్చని చెబుతున్నారు. ఈ లడ్డు జుట్టు, గోళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిపారు ఆరోగ్య నిపుణులు. గుమ్మడి గింజలు – 1/3 కప్పు,పిస్తా గింజలు – 1/3 కప్పు,కొబ్బరి పొడి – 2/3 కప్పు,మునగాకు పొడి – 2 టేబుల్ స్పూన్లు,యాలకులు – మూడు కిస్‌మిస్ – 3/4 కప్పు కలిపి మునగలడ్డూను తయారు చేసుకోవాలి.
ఈ లడ్డుని రోజుకు ఒకటి చొప్పున తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మునగాకుల్లో విటమిన్ ఎ, సి లతో పాటుగా విటమిన్ బి కాంప్లెక్స్, అమైనో యాసిడ్స్, జింక్, క్యాల్షియం, ఐరన్, కాపర్, పొటాషియం, సిలికా, మెగ్నీషియం, మాంగనీసు, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయని నిపుణలు చెబుతున్నారు. ఇవి చర్మం, జుట్టు, గోళ్ల ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
Also Read: షుగర్ ఫాస్టింగ్ మంచిదేనా!