- Advertisement -
కొండా సురేఖ నా కుటుంబంపై అమర్యాదకరంగా మాట్లాడారన్నారు అక్కినేని నాగార్జున. కొండా సురేఖ కామెంట్స్‌పై క్రిమినల్ కేసుతోపాటు, పరువు నష్టం దావా విచారణలో భాగంగా నాంపల్లి కోర్టుకు నాగార్జున, అమల, నాగచైతన్యతోపాటు సుప్రియ, వెంకటేశ్వర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాగార్జున స్టేట్‌మెంట్ రికార్డు చేయగా మా కుటుంబానికి మంచి పేరు, ప్రతిష్టలున్నాయి… నాగచైతన్య, సమంతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్నారు. మా కుటుంబ పరువు, మర్యాదలకు భంగం వాటిల్లింది… మంత్రి చేసిన కామెంట్స్ అసత్య ఆరోపణలు అన్నారు. ఈ వార్తలు అన్ని చానెళ్లు, పేపర్లలో వచ్చాయి. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టుకు నివేదించారు నాగ్.
అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 10కి వాయిదా వేసింది న్యాయస్థానం.
Also Read:ఆదిపర్వం..రిలీజ్ డేట్ ఫిక్స్
- Advertisement -