RSP: తెలంగాణలో విద్యావ్యవస్థ శిథిలం

4
- Advertisement -

గత పది సంవత్సరాల్లో తెలంగాణ విద్యా వ్యవస్థ శిథిలం అయిందని సీఎం,డిప్యూటీ సీఎం అంటున్నారు..21 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ శంఖుస్థాపన చేస్తామని ప్రభుత్వం అంటోందన్నారు బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో ప్రభుత్వం ప్రజల వద్దకు వస్తోంది…కేసీఆర్ ఎంతో శ్రమించి గురుకుల వ్యవస్థను తీసుకువచ్చారు అన్నారు.

డిప్యూటీ సీఎం భట్టికి గురుకుల విద్యా వ్యవస్థపై అవగాహన లేదు…సీఎం,డిప్యూటీ సీఎం ఎప్పుడైనా గురుకులాల వద్దకు వెళ్ళారా అన్నారు. గురుకులాల్లో ప్రతి పాఠశాలకు ఒక జీవో ఉంటుంది…ఇప్పుడున్న ఉన్న గురుకులాల్లో అన్ని సామాజిక వర్గాల విద్యార్థులు ఉన్నారు అన్నారు.

మీరు తీసుకువచ్చిన సామాజిక న్యాయం ఏంటో ప్రజలకు చెప్పాలి…పది లక్షల మంది విద్యార్థులతో ప్రభుత్వం ఆడుకుంటోందన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నారు ప్రస్తుతం ఉన్న ఎస్సి,ఎస్టీ,బీసీ గురుకులాలను బంద్ చేస్తారా…ఒక్కో విద్యార్థిపై కేసీఆర్ లక్ష రూపాయలు ఖర్చు చేశారు అన్నారు. మండలాల్లో ఉన్న గురుకులాలను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది…662 గురుకులాలకు బడ్జెట్ ఇవ్వండన్నారు.

Also Read:వైసీపీ భూ స్థాపితం కావడం ఖాయం: బుద్దా వెంకన్న

భట్టి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నారు…సెంట్రల్ యూనివర్సిటీలో అందరికి ఒకే హాస్టల్,డైనింగ్ లేదు అన్నారు.స్కూల్స్ కోళ్ల ఫామ్స్ కాదు..ఒకే చోట 2,560 మంది విద్యార్థులు ఎట్లా ఉంటారన్నారు. 60 మంది విద్యార్థులకు కేసీఆర్ పది ఎకరాల స్థలం, కేటాయించారు…2,560 మందికి 25 కోట్లతో భవనాలు ఎట్లా కడతారు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో సంక్షేమ శాఖలు అన్ని రద్దు చేస్తారా…?,కేసీఆర్ జీవో నంబర్ 55 తీసుకువచ్చి అన్ని వర్గాలకు ఉద్యోగాల్లో అవకాశం కల్పించారు అన్నారు.

రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక జీవో నంబర్ 29 తెచ్చారు..సీఎం,డిప్యూటీ సీఎం అబద్ధాల ప్రచారం చేస్తున్నారు అన్నారు. కేసీఆర్ హయాంలో విద్యార్థులు విమానాలు ఎక్కారు…సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరే 28 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టారు అని ఎద్దేవా చేశారు.

- Advertisement -