కాంగ్రెస్ అంటేనే క్రైసిస్ అన్నారు బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన రాకేశ్ రెడ్డి…కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నా ఆర్ధిక సంక్షోభం వస్తుంది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిందన్నారు. కట్టిన ఫ్లాట్స్ అమ్ముడుపోవడం లేదు. హైదరాబాద్ నగరంలో టూ-లెట్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. గ్రామ పంచాయతీ కార్మికులకు తొమ్మిది నెలలుగా జీతాలు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇప్పటివరకు రూపాయి ఇవ్వలేదు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసిందని ఆరోపించారు.
సింగరేణి కార్మికులకు రావాల్సిన బోనస్‌ను బోగస్ చేసింది రేవంత్ సర్కార్ అని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. కార్మికుల జేబుల్లోకి పోవాల్సిన డబ్బులతో తమ జేబులు నింపుకున్నరు. వారికి ఇవ్వాల్సిన బోనస్ ఇచ్చేంత వరకు కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందన్నారు.
అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా రేవంత్ రెడ్డి మారారన్నారు బాల్క సుమన్. రైతు రుణమాఫీ చేశామంటూ గొప్పలు చెప్పుకొని, నిన్న ప్రధానికి రాసిన లేఖలో రుణమాఫీ కాలేదని అసలు నిజాన్ని ఒప్పుకున్నాడన్నారు.
Also Read:హాస్టల్ వార్డెన్‌లకు ప్రమోషన్లు: పొన్నం