కొండా చీప్ కామెంట్స్‌పై సమంత!

1
- Advertisement -

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై స్పందించారు సమంత, నాగ చైతన్య. ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించిన సమంత.. కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై అభ్యంత‌రం తెలిపారు. మ‌హిళ‌ల్ని వ‌స్తువుల్లా చూసే ఈ గ్లామ‌ర్ ప‌రిశ్ర‌మ‌లో ప‌నిచేయ‌డం, ప్రేమ‌లో ప‌డ‌టం, నిల‌బ‌డి పోరాడ‌టానికి చాలా శ‌క్తి కావాలి, నా ప్ర‌యాణాన్ని చిన్న‌చూపు చూడొద్దు, ఇక విడాకుల‌నేవి పూర్తిగా నా వ్య‌క్తిగ‌త విష‌యం అని తెలిపారు. అది ఇద్ద‌రి అంగీకారంతో ఎటువంటి రాజ‌కీయ కుట్ర లేకుండా జ‌రిగింది. ద‌య‌చేసి నా పేరును రాజ‌కీయాల‌కు దూరం పెట్టండి అంటూ హితవు పలికారు.

కేటీఆర్‌ తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారని కొండా సురేఖ అన్నారు. కొందరు హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని సినిమా ఫీల్డ్‌ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్‌ ఆరోపణలు చేశారు సురేఖ. కేటీఆర్ మత్తు పదార్థాలకు అలవాటు పడి, సినిమా వాళ్లకు కూడా వాటిని అలవాటు చేశారని విమర్శించారు.

అయితే సురేఖ చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారగా ఆమె మాటలను చాలామంది తప్పుబడుతున్నారు. సాక్ష్యాధారాలు లేకుండా ఓ వ్యక్తిపై ఇంతలా చెత్త కామెంట్స్ ఏ పొలిటిషియన్ చేసి ఉండరని విమర్శిస్తున్నారు.

Also Read:మంత్రి కొండాకు కేటీఆర్ లీగల్ నోటీసులు..

- Advertisement -