మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’. రీసెంట్ గా రిలీజైన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెంచింది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో గోపిచంద్ ఈ చిత్రం, దర్శకుడు శ్రీను వైట్ల గురంచి కొన్ని ఇంట్రెస్టింగ్ కామంట్స్ చేశారు. విశ్వం సినిమాను దర్శకుడు శ్రీను వైట్ల చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్నారని.. ఈ సినిమాను ఆయన కేవలం 75 రోజుల్లోనూ పూర్తి చేశాడని గోపీచంద్ తెలిపారు.
ఎక్సోటిక్ లొకేషన్స్‌లో చిత్రీకరించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. మొరాకో మగువా సాంగ్ మ్యూజిక్ ప్రమోషన్‌లు కు చార్ట్ బస్టర్ స్టార్ట్ ఇచ్చింది. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Also read:Harish: హోంగార్డ్‌లు అంటే అంత చులకనా?