గుండాలను పంపిన రేవంత్‌కి కేటీఆర్ గట్టి హెచ్చరిక

1
- Advertisement -

నా ప్రజలకు అండగా నిలబడడాన్ని నువ్వు ఆపలేవని గట్టిగ సిఎం రేవంత్ రెడ్డికి హెచ్చరిక జారీ చేశారు కేటీఆర్. మీ తాటాకు చప్పుళ్ళకి భయపడేవాడిని కాదు రేవంత్‌ రెడ్డి అని తెలిపిన కేటీఆర్..మీ తాట తియ్యడానికి వచ్చాను అని చెప్పారు. నీ పిల్లి కూతలకి భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ అని…ఉద్యమాల పిడికిలి ఇది గుర్తు పెట్టుకో అని హెచ్చరిక జారీ చేశారు.

బడుగు బలహీనుల గొంతులను నీ బుల్డోజర్లు తొక్కి పెట్టలేవు అని…నీ గుండ రాజ్యాన్ని… నియంతృత్వ పాలనను సవాలు చేసే నా స్ఫూర్తిని నీ గుండాలు ఆపలేరు అని స్పష్టం చేశారు.

నీ గుండాలు నా వాహనంపై చేసియన దాడి నాకు మరింత శక్తిని ఇస్తుంది…ఇట్లాంటివి మమ్మల్ని ఆపలేవు అని వెల్లడించారు.

Also Read:KTR: హైకోర్టు తిట్టినా ఇండ్లు కూల్చేస్తున్న తుగ్లగ్ రేవంత్..

- Advertisement -