గోవిందా ఇంట్లో గన్‌ మిస్‌ఫైర్‌.. గాయాలు!

4
- Advertisement -

బాలీవుడ్ నటుడు గోవిందా ఇంట్లో గన్ మిస్ ఫైర్ అయింది. ఈ ఘటనలో గోవింద కాలులోకి బుల్లెట్ దూసుకుపోయింది. దీంతో కుటుంబ సభ్యులు గోవిందని హుటాహుటిన ముంబైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

మంగళవారం తెల్లవారుజామున 4:45 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గోవిందా బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న క్రమంలో తన వద్ద ఉన్న లైసెన్స్‌ గన్‌ను తనిఖీ చేస్తుండగా అది ఒక్కసారిగా మిస్‌ఫైర్‌ అయ్యింది. డాక్టర్లు గోవిందకు చికిత్స అందిస్తుండగా ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.

Also read:ఆస్పత్రిలో చేరిన రజినీ..ఆందోళనలో ఫ్యాన్స్!

- Advertisement -