అక్టోబర్ 4న దక్షిణ

7
- Advertisement -

మంత్ర , మంగళ సినిమా ల తో తెలుగు చలన చిత్ర రంగం లొ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ఓషో తులసిరామ్ మళ్ళీ “దక్షిణ ” మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు . కల్ట్ కాన్సెప్ట్స్ బ్యానర్ నిర్మాణం లో అశోక్ షిండే నిర్మాత గా కబాలి ఫేమ్ సాయి ధన్సిక కథనాయాకి గా మహాభారత్ మర్డర్స్ ఫేమ్ రిషవ్ బసు మరొక ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు నటుడు శివాజి, ఆర్పి.పట్నాయక్ ముఖ్య అథితులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ…మంత్ర సినిమాతో సంచలన విజయం సాధించిన దర్శకులు ఓషో తులసీరామ్. అప్పట్లోనే ఆ సినిమా పది కోట్లకు పైన వసూలు చేసింది. ఓషో తులసీరామ్ గారి సినిమాల్లో పాత్ర పడితే అదృష్టం అని చెప్పాలి. మంచి నిర్మాత దొరికితే గొప్ప సినిమాలు చెయ్యగల సత్తా ఉన్న దర్శకుడు ఓషో గారు. మంచి కాన్సెప్ట్ తో వస్తోన్న సినిమా దక్షిణ, ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమా తరువాత ఓషో తులసీరామ్ గారు మరిన్ని మంచి సినిమాలు చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

ఆర్పీ.పట్నాయక్ మాట్లాడుతూ….దక్షిణ ట్రైలర్ చాలా బాగుంది, ఈ చిత్ర సంగీత దర్శకుడు బాలాజీ చాలా ప్రతిభావంతుడు, తనకు ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను, ఓషో తులసీరామ్ గారు గొప్పగా ఆలోచించే దర్శకుడు, మంత్ర సినిమా తరహాలోనే ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను అన్నారు.

ఓషో తులసీరాం మాట్లాడుతూ…నాకోసం దక్షిణ సినిమా ను సపోర్ట్ చెయ్యడానికి వచ్చిన శివాజీ గారికి కృతజ్ఞతలు. నాకు శివాజీ గారికి మంత్ర సినిమా సమయంలో ఎన్నో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. ఒక మంచి నటుడు అంతకంటే మంచి మనిషి శివాజీ.మ్యూజిక్ డైరెక్టర్ బాలాజీ, వెలిగొండ శ్రీనివాస్ రైటర్, ఈ సినిమాకు బెస్ట్ వర్క్ చేశారు, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అశోక్ ఈ సినిమాకు నిర్మాత, సినిమా పట్ల విపరీతమైన ఆసక్తి, మేమిద్దరం కలిసి దక్షిణ సినిమాను ఇంకా బెస్ట్ ఔట్ ఫుట్ కు తీసుకురాగలిగాం, సాయి ధన్సిక చాలా పర్ఫెక్ట్ గా నటించింది, ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు.

Also Read:పాడుతా తీయగా…టాలీవుడ్‌లోకి 30కి పైగా సింగర్స్ ఎంట్రీ

- Advertisement -