పిల్లల్లో మధుమేహం..ఇలా పసిగట్టవచ్చు!

2
- Advertisement -

రోజురోజుకు మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. వయసుతో సంబంధం లేకుండా మధుమేహం బారిన పడుతుండగా ఒక్కసారి మధుమేహం బారిన పడితే దానినుంచి బయటపడడం అంతా తేలికైన విషయం కాదు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు.

మహిళల్లో డయాబెటిస్ కారణంగా హార్మోన్ల అసమతుల్యత, నరాల బలహీనత, రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వంటి ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఇంకా డయాబెటిస్ కారణంగా మహిళల్లో చూపు మందగించడం, కిడ్నీ సమస్యలు, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి.

Also read:స్కందగిరి ఆలయంలో గుడి గుడికో ఓ జమ్మి చెట్టు

ఇక ముఖ్యంగా పిల్లల్లో మధుమేహం వస్తే చాలా సమస్యలు ఎదుర్కొక తప్పుద. అయితే శరీరంలోని లిపిడ్ అణువులు ఎలా మారుతాయో అధ్యాయనం చేయడం ద్వారా మధుమేహం, ఊబకాయా వ్యాధులను గుర్తించి పూర్తిగా నిరోధించవచ్చు అని డాక్టర్లు తెలిపారు. ఈ పరిశోధనలో భాగంగా, ఊబకాయం ఉన్న సుమారు 1,300 మంది పిల్లలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. వారి రక్తంలోని లిపిడ్లను నిశితంగా విశ్లేషించారు.

NOTE : ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే, వీటిని పాటించే ముందు కచ్చితంగా డాక్టర్ల సలహా తీసుకోవాలి.

- Advertisement -