బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. నాలుగో వారంలో ఇంటి నుండి బయటకు వచ్చారు సోనియా అనంతరం సోనియా బ్యూటీఫుల్ జర్నీని చూపించారు నాగ్. హ్యాపీ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్.. అన్నీ ఉన్నాయి… గుడ్ వన్ సార్ అని చెబుతుంది సోనియా. గుడ్ వన్?! ఏంటీ కొంచెం షాక్‌లో ఉన్నావా? అని నాగ్ అనగా మార్నింగ్ నుంచి బయటికి రావడానికి సిద్ధంగానే ఉన్నాను.. నిజానికి నేను ఒంటరిని అయిపోయాను అని చెబుఉంది.
నేను మార్చుకోదలచుకోలేదు సార్.. నేను ఏం అనుకుంటా అంటే.. నేను నేర్చుకున్నది నా జీవితం నుంచి నేర్చుకున్నా అని చెబుతుంది. నేను మీ జడ్జిమెంట్ కోసం వెయిట్ చేశా.. ముందు వారం మీరు నాకేం చెప్పలేదు.. సెల్ఫ్ డౌట్ వద్దని అన్నారు. కాబట్టి నేను బాగానే ఆడుతున్నానని అనుకున్నా అని చెబుతుంది సోనియా. ఆ తర్వాత హౌస్‌మేట్స్‌తో మాట్లాడించారు నాగ్.
సీతూతో మొదటిలోనే నామినేషన్ చేశాను.. వీళ్లంతా క్లోజ్డ్… యష్మీ అయినా కనీసం నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేసింది కానీ.. మిగిలిన వాళ్లంతా మరీ ముఖ్యంగా అమ్మాయిలంతా కలిసే టీమ్ అప్ అయ్యి.. చీఫ్ అప్పుడు కూడా నేను ఒంటరిని అని చూపించారు అని చెప్పింది సోనియా.
తర్వాత సోనియాతో చిన్న గేమ్ ఆడించారు నాగ్. నీ వెనుక మహా తాళీ ఉంది.. ఇందులో ఆరు రకాలను ఎంచుకో.. హౌస్ మేట్స్‌లో ఎవరికి ఏ ఐటమ్ చెందుతుందో చెప్పమంటారు నాగ్. వెంటనే సోనియా.. పులిహోరా విష్ణుకే వెళ్తుంది సార్.. ఆమెకు నచ్చితే ఎంతైనా చేస్తుంది. పులిహోరా కలుపుతూనే ఉంటుందని చెబుతుంది. కాకరకాయ వేపుడు సీతూ… టక్ మని మాట్లాడేస్తుంది.. అండ్ తర్వాత ఇక మాట్లాడను ఇక అంతే ఇక అంటుందని చెబుతుంది.
Also Read:గేమ్ చేంజర్..సాంగ్ ప్రోమో
ఆవకాయ.. ప్రేరణ. తను క్యూట్ అండ్ స్వీట్ కానీ.. తనకు నచ్చనిది ఏదైనా ఉంటే ఏదొకటి అంటూనే ఉంటుందని.. నబీల్ రోటీలాగే.. సాఫ్ట్‌గానే ఉంటాడు. పైకి అలా కనిపిస్తాడు కానీ.. మంచివాడే అని చెప్పుకొచ్చింది. పాయసం పృధ్వీ.. తనను అంతా ఇష్టపడుతుంటారు.. అలాగే నిఖిల్ అన్నం లెక్క.. అన్నం లేకపోతే ఏం లేదు.. అంటే అక్కడ నువ్వు లేకపోతే ఏం మ్యాటర్ లేదు అని చెబుతుంది. యష్మీ చాలా టఫ్‌గా ఉండటానికి ట్రై చేస్తుంది కానీ.. తను చాలా నైస్ అండ్ ఎమోషనల్ అని చెబుతుంది. చివరగా నిఖిల్ వెళ్తుంటే ఐ మిస్ యూ మచ్చా అని ఏడ్చేశాడు నిఖిల్. దాంతో సోనియా.. ఎమోషనల్ అవుతూ.. మంచిగా ఆడు అని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పేసి బిగ్ బాస్ హౌస్‌ను వీడింది.