- Advertisement -
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉచితంగా రాష్ట్రంలో పర్యాటక, చారిత్రక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందు కోసం తెలంగాణ దర్శిని కార్యక్రమాన్ని తీసుకువచ్చామని, దానికి సంబంధించిన జీవోను ఇప్పటికే జారీ చేశామన్నారు.
చారిత్రక, పర్యాటక ప్రాంతాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం తెలంగాణ దర్శిని తీసుకువచ్చినట్లు సీఎం వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీప్రసాద్, సీఐఐ తెలంగాణ ఛైర్మన్ సాయి ప్రసాద్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు పాల్గొన్నారు.
Also Read:దేవర ఫస్ట్ డే..వసూళ్లెంతో తెలుసా?
- Advertisement -