దేవర ఫస్ట్ డే..వసూళ్లెంతో తెలుసా?

5
- Advertisement -

మ్యాన్ ఆఫ్ మాసెస్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మించారు. సినిమాటోగ్రాఫర్ ఆర్‌.ర‌త్న‌వేలు, ఎడిట‌ర్ శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ సాబు శిరిల్ వంటి స్టార్ టెక్నీషియ‌న్స్ ఈ చిత్రానికి వ‌ర్క్ చేయగా జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించారు.

ఇక ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు బాక్సాఫీస్ వద్ద దాదాపు 125 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

క‌ల్కి ప్ర‌పంచ వ్యాప్తంగా తొలి రోజున రూ.177.70 కోట్ల‌ను వ‌సూలు చేసింది. ఇక దేవ‌ర విష‌యానికి వ‌స్తే.. ప్ర‌పంచ వ్యాప్తంగా సుమారు రూ.75 కోట్ల అడ్వాన్స్ బుకింగ్‌లను నమోదు చేసిందని ఫిల్మ్ ట్రేడ్ పోర్టల్ సక్‌నిల్క్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్/తెలంగాణ మార్కెట్‌లో ఈ చిత్రానికి రూ.65-70 కోట్ల వరకు గ్రాస్ క‌లెక్ష‌న్లు రావొచ్చున‌ని అంచనా వేస్తున్నారు.

Also Read:దేవర ట్విట్టర్ రివ్యూ..!

- Advertisement -