ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆరు గ్యారెంటీల పేరుతో అబద్దపు పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ …ఏ ఒక్క కొత్త పథకం కానీ, ప్రాజెక్టును కానీ ప్రారంభించలేదన్నారు.
ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏమిటి..? అని రేవంత్‌ను ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఇచ్చిన 30వేల ఉద్యోగాలు మనమే ఇచ్చినట్టు బిల్డప్ ఇవ్వడం… గతంలో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కట్టలేదు అని చిల్లర మాటలు మాట్లాడి, ఇప్పుడు పదిహేను వేల డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మనమే కట్టినట్టు ఫోజులు కొట్టడం ఇన్నోవేటివ్ థింకింగా అని ప్రశ్నించారు.
అర్హతలు లేని బావమరిది కంపెనీకి వేల కోట్ల ప్రజా సొమ్ము కట్టబెట్టడం,హైకోర్టులో మాత్రం రద్దు చేయలేదు అని న్యాయమూర్తులను కూడా మోసం చేయడం ఇన్నోవేటివ్ థింకింగా అని ప్రశ్నించారు.
ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏమిటి ?
✳️ ఎన్నికలకు ముందు ప్రజలకు అడ్డగోలు హామీలు ఇచ్చి తర్వాత మాట తప్పడం. దేవుళ్ళ మీద ఒట్టేసి వారికి కూడా శఠగోపం పెట్టడం
✳️ నూరు రోజులు, ఆరు గారంటీలు అని ఊదరగొట్టి తర్వాత వాటిని మర్చిపోవడం, ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రతిరోజూ ఒక కొత్త డ్రామా…
— KTR (@KTRBRS) September 26, 2024