నిద్రపట్టడం లేదా..అయితే మీకోసమే!

6
- Advertisement -

నిద్రలేమి అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలకు ఇబ్బందిగా మారిన రుగ్మత. సాధారణంగా పగటి నిద్రపోవడం, నిద్రాణస్థితి, మానసికంగా మరియు భౌతికంగా అనారోగ్యంగా ఉండటంతో పలు రకాల సమస్యలు నిద్రలేమి సమస్యకు దారితీస్తాయి. ఫలితంగా చిరాకు,మానసికంగా ఆందోళన చెందడం,ఏ పనిపై దృష్టి సారించకపోవడంతో పాటు అనేకమైన దీర్ఘకాలిక వ్యాధుల బారీన పడే ప్రమాదం ఉంది.

మీకు సరిగా నిద్రపట్టడం లేదంటే, అందుకు ఆకలి కూడా ఒక కారణం కావచ్చు. కాబట్టి, ఒక ఆరోగ్యకరమైన భోజనం ముగించిన తర్వాత కూడా మీకు ఆకలిగా అనిపిస్తుంటే, అటువంటి సమయంలో క్రాకర్స్ లేదా గోధుమలతో తయారు చేసి స్నాక్స్ ను తినవచ్చు.కొన్ని రకాల హెర్బల్ టీలు నిద్రపట్టేందుకు సహాయపడుతాయి. భోజనం తర్వాత కొంత నడక సారించడం వల్ల గాఢంగా నిద్రపట్టడంలో మరియు మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది.

ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం 8 గంటలపాటైనా నిద్ర ఉండాలి. అయితే ఉద్యోగం, ఇతరత్ర పనులు, మానసిక సమస్యలతో కొంత మంది సరిగా నిద్రపోరు. నిద్రలేమితో జీవితాన్ని కొనసాగిస్తే కొన్ని రోజుల్లో ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

24 గంటలకు మించి నిద్రలేమితో ఉన్నవారికి కాస్త మగతగా అనిపించడమే కాదు మెదడు పనితీరు మందగించి ఏకాగ్రత దెబ్బతింటుంది. దీనివల్ల చిన్న, చిన్న విషయాలకే చిరాకు పడతారు. శరీరంలో నాడీవ్యవస్థలో సమతుల్యం దెబ్బతింటుంది. మూడురోజులకు మించి నిద్రలేమితో ఉన్నట్లైతే, అలాంటివారిలో మెదడు తీవ్ర ఒత్తిడికి లోనవుతుందని నిపుణులు గుర్తించారు.

Also Read:ఇలా చేస్తే ఊపిరితిత్తుల ఆరోగ్యం.. పదిలం!

అలాగే నిద్రలేమితో మనిషి ఏదో కోల్పోతున్న భావనలోకి వెళ్లిపోతారని గుర్తించారు. శరీరంలో తేమశాతం తగ్గి చర్మం పొడిబారిపోతుందని నిపుణులు తెలిపారు. నిద్రలేమితో ఏది నిజమో.. ఏది బ్రాంతో తేల్చుకోలేని స్థితికి చేరుకుంటారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎన్ని సమస్యలు, ఒత్తిడి ఉన్నా హాయిగా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది.

- Advertisement -