KTR : దేవర ప్రీ రిలీజ్ రద్దుపై కేటీఆర్

5
- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై షాకింగ్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పోలీసులంతా సీఎం రేవంత్ రెడ్డి బందోబస్తులో ఉండటంతో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దైందన్నారు.

తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాల పండగలు, ఈవెంట్లు శాంతియుతంగా చేశామని…కానీ చివరికి సినిమాలకు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చేసిన ఘనత మా ప్రభుత్వానిది అన్నారు.

కానీ పాపం నిన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా. ఆయన ఇక్కడ ఏదో రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుంటే దాన్ని కూడా నిర్వహించేలేని అసమర్థత ఈ ప్రభుత్వానిదని.. అలాంటి పరిస్థితిలోకి ఈ నగరం వెళ్ళిపోయిందని కేటీఆర్ మండిపడ్డారు.

Also Read:కస్టడీకి జానీ మాస్టర్..థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దు

- Advertisement -