ఎస్టీపీలను సందర్శించిన బీఆర్ఎస్ బృందం

7
- Advertisement -

హైదరాబాద్ నగరంలో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఎస్టీపీల ను భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోని పార్టీ నేతల బృందం సందర్శించింది. మొదట కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఎస్టిపిని సందర్శించింది.

మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు పలువురు సీనియర్ నేతలు ఉన్నారు

హైదరాబాద్ నగరాన్ని మురికి నీటి రహిత నగరంగా మార్చేందుకు గత ప్రభుత్వం గొప్ప లక్ష్యంతో ఈ కార్యక్రమాలను ప్రారంభించింది.అందులో భాగంగానే 3866 కోట్ల రూపాయలతో భారీ ఎత్తున మురిగినీటి శుద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.

ఈ ఎస్ టి పి ల నిర్మాణం పూర్తి అవుతే మురుగునీటిని 100% శుద్ధి చేస్తున్న నగరంగా హైదరాబాద్ గణత సాధిస్తుంది .అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్టిపిల నిర్మాణంలో వేగం తగ్గింది.హైదరాబాద్ నగర ప్రజలను మురికినీటికి దూరం చేసే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పూర్తిచేసేలా ప్రయత్నం చేయాలి. హైదరాబాద్ నగర ప్రజలకోసం భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం చేసిన గొప్ప కార్యక్రమం ఈ ఎస్టీపీల నిర్మాణం చేపట్టారు.

Also Read:త్వరలో తమిళనాడుకు కేటీఆర్

- Advertisement -