అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరం తారాస్థాయికి చేరుకుంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమల హారిస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోరు సాగుతోంది. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్. ఈనెల 21 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ…అమెరికాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీని కలుస్తానని చెప్పారు ట్రంప్.
ప్రధాని మోదీ అద్భుతమైన వ్యక్తిని అని…తనను కలిసేందుకు మోదీ అమెరికా వస్తున్నారని ట్రంప్ వెల్లడించారు. సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు జరిగే క్వాడ్ సమావేశాల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. విల్మింగ్టన్‌లో నాలుగోసారి ఈ శిఖరాగ్ర సదస్సు జరగనున్నది. న్యూయార్క్‌లోని భారతీయ సంతతి ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడనున్నారు.
మోదీ, ట్రంప్ చివరిసారి 2020 ఫిబ్రవరిలో కలిసిన సంగతి తెలిసిందే.
Also Read:KTR: కేసీఆర్ సాధించిన విజయాలు ఎప్పటికీ చెదిరిపోవు