KTR:గాంధీ భవన్‌కే రాజీవ్ విగ్రహం..కేటీఆర్ స్పష్టం

5
- Advertisement -

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్‌కు పంపిస్తామని స్పష్టం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సెప్టెంబర్ 17 ఎంతోమంది పోరాట యోదులు వలన స్వేచ్ఛవాయవును పీల్చుకుంటున్నాం అన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా తెలంగాణ ప్రజలు ఉంటారు అన్నారు.

గత పది సంవత్సరాల ఒక్క ఇన్సిడెంట్ జరగకుండా కేసీఆర్ పాలన జరిగిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం మానుకోవాలని…మా తమ్ముళ్లు చెల్లెలు ఎదురు చూస్తున్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు అని అన్నారు. రైతు భరోసా ఇవ్వు,పింఛన్ ఇవ్వు, మా ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు 2500 మహాలక్ష్మి ఎప్పుడు ఇస్తావు అని అన్నారు.

హైదరాబాద్ అతలాకుతలం అవుతుంది, హైదరాబాద్ లో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి అన్నారు. పత్రికలు రాస్తున్నాయ్ ఒక్క నెలలు 30 మర్డర్లు అయ్యాయి అని , హోమ్ మంత్రిని పెట్టు శాంతిభద్రతలు కాపాడు అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహన్ని సచివాలయం ముందు పెట్టుకుందాం అనుకుంటే, అక్కడ రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు ..నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కంప్యూటర్ ని రాజీవ్ గాంధీ కనిపెట్టాడు అంటాడు, నీకు తెలియదు, ఎవరైనా చేప్తే వినవు అని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అంటే విషజ్వరాలు పెరిగాయి…సెప్టెంబర్ 17ని ప్రజాపాలన అని చెప్పుతున్నాడు రేవంత్ రెడ్డి, ఇప్పటి వరకు రాష్ట్రంలో పాలననే లేదు అన్నారు. ఇకనైనా పరిపాలన పైన దృష్టి పెట్టండి…మీరు ఇచ్చిన 420 హామీలు నేర్వర్చే వరకు మిమ్మల్ని వదలం అన్నారు. మేము అధికారంలోకి వచ్చిన తరవాత సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్ కి పంపిస్తాము, లేకపోతే మీ ఇంట్లో పెట్టుకో అని సూచించారు కేటీఆర్.

Also Read:ఆల్‌ టైం రికార్డు.. గణేష్ లడ్డు రూ.కోటి 87 లక్షలు

- Advertisement -