చెమటపట్టకుండా సెమీస్ చేరుకుంటుందనుకున్న భారత్‌కు గట్టి షాక్ తగిలింది. గురువారం కెన్నింగ్టన్‌లో జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో భారత్ చిత్తయ్యింది. 322 పరుగులభారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. గుణతిలక 76, మ్యాథ్యూస్ 52 కుశాల్ పెరీర, గుణరత్నె 34 పరుగులు చేసి మరో 8 బంతులు మిగలి ఉండగానే శ్రీలంకను విజయ తీరాలకు చేర్చారు. 93 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 89 పరుగులు చేసిన కుశాల్ మెండిస్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
అంతకుముందు టాస్ ఓడి టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్‌లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. రోహిత్, ధావన్‌లు మరోసారి సెంచరీ భాగస్వామ్యంతో కదం తొక్కారు. తొలి వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రోహిత్ 79 బంతుల్లో 6 ఫోర్లు,3 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టాడు. ధావన్ (128 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌తో 125 పరుగులు) సెంచరీతో రెచ్చిపోయాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ (0; 5 బంతుల్లో) అభిమానులకు షాకిచ్చాడు. కీలక మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు.తర్వాత వచ్చిన యువరాజ్ కూడా 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాటపట్టాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ధోని 52 బంతుల్లో 7 పోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. చివర్లో కేదార్ జాదవ్ 13బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 25 పరుగులు పిండుకోవడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. తన చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడిస్తేనే భారత్ ముందంజ వేస్తుంది. లేదంటే ఇంటికే!