KTR:రైతుల ప్రాణాలు తీస్తున్న సీఎం రేవంత్

3
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి రైతుల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్.. కేసీఆర్ రైతును రాజు చేస్తే.. ఈ కాంగ్రెస్ స‌ర్కార్ అన్న‌దాతల ప్రాణాల‌ను తీస్తుందంటూ ధ్వ‌జ‌మెత్తారు.రుణ‌మాఫీ కాలేద‌ని కొంద‌రు.. రైతు భ‌రోసా అంద‌క ఇంకొంద‌రు అన్న‌దాత‌లు ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నారు అని దుయ్యబట్టారు. అన్నదాత‌ల ప‌రిస్థితి ఆందోళ‌న‌కరంగా మారినా.. కాంగ్రెస్ స‌ర్కార్ మొద్దు నిద్ర వీడటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి చేసిన తీరని ద్రోహానికి ఇంకా ఎంతమంది రైతులు ప్రాణాలను బలిపెట్టాలి..? అని ప్రశ్నించారు. ఏకకాలంలో అందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ అని ఇచ్చిన మాటతప్పిన సీఎంను ఏం చేయాలి..? చెప్పాలన్నారు.

అటు బ్యాంకులు, ఇటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా రుణమాఫీ కాకపోవడంతో మేడ్చల్‌లో వ్యవసాయ కార్యాలయం సాక్షిగా రైతు సురేంద‌ర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. తన తల్లికి, తనకు ఉన్న రుణం మాఫీ కాకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దగాకు బలైపోయాడ‌ని కేటీఆర్ తెలిపారు. భార్యాభర్తలిద్దరిలో ఒక్కరి కూడా రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో జగిత్యాలలో పురుగుల మందు తాగి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు రైతు సాగ‌ర్ రెడ్డి అని గుర్తు చేశారు.

డిసెంబర్‌లో పెట్టిన డెడ్ లైన్ సెప్టెంబర్ దాటినా అమలుకాకపోతే దగాపడ్డ అన్నదాతలు ఇంకా ఎవరికి చెప్పుకోవాలి..? రూ. 49,500 వేల కోట్ల రుణమాఫీలో పావుశాతం కూడా చేయకుండా చేతులెత్తేసినందుకు రైతన్నలకు క్షమాపణలు చెప్పాలి రేవంత్ స‌ర్కార్…రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. దైర్యంగా ఉండాలని కోరుతున్నాను అని కేటీఆర్ తెలిపారు.

Also Read:డ్రగ్స్ తీసుకున్న హేమ..పోలీసుల ఛార్జ్‌షీట్

- Advertisement -