111 ఎకరాలు స్వాధీనం చేసుకున్న హైడ్రా!

7
- Advertisement -

ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ల పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తోంది హైడ్రా. కొంతమంది కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకోగా వాటిని సైతం న్యాయపోరాటం చేసి కూల్చేసేందుకు సిద్ధమవుతోంది. ఇక హైడ్రా ఇప్పటివరకు 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా వెల్లడించింది. మొత్తం 111.72 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు పేర్కొన్నది. రాజేంద్రనగర్ -45, మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో 42 నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా వివరించింది.

రామ్ నగర్ మణెమ్మ గల్లీలో 3, అమీన్ పూర్ పెద్ద చెరువు పరిధిలో 24, గగన్ పహాడ్ అప్పా చెరువులు 14, దుండిగల్ కత్వా చెరువు పరిధిలో 13, మాదాపూర్ సున్నం చెరువులో 42 అక్రమ నిర్మాణాలను తొలగించాం. అదేవిధంగా అక్రమ నిర్మాణాలను తొలగించి మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాం. అత్యధికంగా అమీన్ పూర్ లో 51 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నాం అని నివేదికలో వెల్లడించింది.

Also Read:వైఎస్‌ జగన్‌కు హైకోర్టులో ఊరట..

- Advertisement -