KTR: గాలిలో దీపంలా విద్యా వ్యవస్థ

5
- Advertisement -

కాంగ్రెస్ పాలనలో గాల్లో దీపం లా విద్యావ్యవస్థ మారిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. సార్లు లేని బడులు, లెక్చరర్లు లేని కాలేజీలు, చివరకు చాక్ పీసులు-డస్టర్లు లేని స్కూల్స్, అద్దె చెల్లించలేదని కాలేజీలకు తాళాలు, రోడ్లపైకి విద్యార్థులు వస్తున్న పరిస్థితి నెలకొందన్నారు.

పాఠశాలలు ప్రారంభమయి నెలలు గడుస్తున్నా గ్రాంట్స్ విడుదల చెయ్యకపోవడం సిగ్గుచేటు అని…విద్యా శాఖకు మంత్రి లేడు..శాఖను దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి దిక్కు లేడు అన్నారు. తక్షణం విద్యా శాఖ పై ఉన్నత స్థాయి సమీక్ష జరిపి సమస్యలు పై ద్రుష్టి పెట్టండి-పిల్లల బంగారు భవిష్యత్ తో చెలగాటం వద్దు అన్నారు.

 

Also Read:Revanth Reddy:అక్రమ నిర్మాణాల కూల్చివేత ఆగదు

- Advertisement -