10న దాసరి సంతాప సభ

190
- Advertisement -

తెలుగు పరిశ్రమలో ఉన్న అన్ని శాఖలు కలిసి దాసరికి ఘనంగా  నివాళి అర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నెల 10న ఫిల్మ్ ఛాంబర్ రామానాయుడు కల్యాణ మండపంలో సాయంత్రం 4 గంటలకు సంతాప సభ నిర్వహించనున్నారు. కొంతమంది స్టార్స్ తో పాటు సినీ ప్రముఖులు విదేశాల్లో షూటింగ్‌లో బిజీగా ఉండటం వలన అందరికి అనుకూలంగా ఉండే తేదీని ఖరారు చేశామని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, మా, ఫిల్మ్ ఫెడరేషన్, దర్శకుల సంఘం ప్రతినిధులు హాజరుకానున్నారు.  ఈ నెల రెండవ ఆదివారం అన్ని షూటింగ్ లను రద్దు చేయాలని నిర్ణయించాం అని నిర్మాత సి కళ్యాణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పరుచూరి గోపాల కృష్ణ , దర్శకుడు వీరశంకర్, నటి హేమ, నిర్మాత దామోదర్ ప్రసాద్, మద్దినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Dasari Condolence Meet on June 10th

- Advertisement -