తెలంగాణకు కేంద్ర బృందం..

7
- Advertisement -

తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలతో ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు తెచ్చిన నష్టాన్ని ప్రాధమికంగా అంచనా వేసింది ప్రభుత్వం. దాదాపు రూ.417 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. ఇందుకు సంబంధించిన నివేదికను సిద్ధం చేసింది.

ఈ నేపథ్యంలో రేపు కేంద్ర బృందం తెలంగాణలో పర్యటించనుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం ఖమ్మం, మహబూబాబాద్ సహా వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేస్తుందని తెలిపారు. ఆ నివేదికను బట్టి కేంద్రం త్వరగా సాయం చేసేందుకు కృషి చేయనుందని వెల్లడించారు.

ఖమ్మం జిల్లాలో వరదల ధాటికి ఆరుగురు మృతిచెందినట్లు , బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సర్కారు పరిహారం అందజేసింది.

Also Read:మళ్లీ ఉగ్రరూపం దాల్సిన గోదావరి..

- Advertisement -