మళ్లీ ఉగ్రరూపం దాల్సిన గోదావరి..

5
- Advertisement -

భద్రాచలం వద్ద గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుసతున్న భారీ వర్షాలతో గోదావరిని భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఇవాళ ఉదయం నాటికి 45 అడుగులు దాటగా దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. గోదావరి ప్రవాహం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరికను జారీచేయనున్నారు.

ప్రస్తుతం భద్రాచలం వద్ద 9 లక్షల 46 వేల 412 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదలవుతోండగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక జారీ చేశారు.

ఇంద్రావతి, ప్రాణహిత నదుల నుంచి గోదావరిలోకి లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్​ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది.

Also Read:Harish Rao: తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ

- Advertisement -