Harishrao: రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు

10
- Advertisement -

రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన హరీశ్.. ఈ ప్రెస్ మీట్ బాధతో ,దుఃఖం తో పెట్టాల్సి వస్తోందన్నారు. అన్నదాత పట్ల ప్రభుత్వంది వంచన .. తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలన రైతుల పట్ల యమపాశంగా మారిందన్నారు. మేడ్చల్ లో వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు లేఖ రాసి మరీ సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు.. సురేందర్ రెడ్డి కి apgvb లో అప్పు ఉందన్నారు.

సురేందర్ రెడ్డి అమ్మకు లక్షా 15 వేలు ,సురేందర్ రెడ్డి కి లక్షా 92 వేలు అప్పు ఉంది, బ్యాంకు మేనేజర్ అనిరుద్ కుటుంబ సభ్యుల్లో ఒక్కరికే రుణమాఫీ అవుతుందని చెప్పడం తో సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు అన్నారు. సురేందర్ రెడ్డి ఆత్మహత్య లేఖ లోని ప్రతి అక్షరం రేవంత్ రెడ్డి ని నగ్న స్వరూపాన్ని బయటపెట్టిందన్నారు. రేవంత్ రెడ్డి పూటకో మాట పొద్దు తిరుగుడు కంటే వేగంగా మారుతోందని.. రేషన్ కార్డు లింకు లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పావ్ అన్నారు. సురేందర్ రెడ్డి ఆత్మహత్య రేషన్ కార్డుకు రైతు రుణ మాఫీకి ఉన్న లింక్ ఉన్నదని నిరూపితం అయ్యిందన్నారు. రేవంత్ పాలనకు సురేందర్ రెడ్డి లేఖ ఓ పంచనామా లాంటిదని.. రైతు రుణమాఫీ ఆంక్షలతో రేవంత్ కుటుంబ బంధాల్లో చిచ్చు పెట్టారు అన్నారు.

కేసీఆర్ కుటుంబ బంధాలు బలోపేతం చేస్తే వాటిని విచ్చిన్నం చేసిన దరిద్రపు గొట్టు ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం .. నా నియోజకవర్గం లో జక్కాపూర్ గ్రామం లో గురజాల బాల్ రెడ్డి కుటుంబం లో ముగ్గురికి రుణం ఉందన్నారు. వారికి ఆరు లక్షల అప్పు ఉంటె కేవలం రెండు లక్షలే మాఫీ అవుతోంది.. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి అన్నారు. ఇది రైతుల పాలిట రేవంత్ చేసిన మోసం ,దగా కాదా ?, రైతు రుణ మాఫీ ఎగ్గొట్టడానికి రేవంత్ ప్రభుత్వం 31 సాకులు చూపెడుతోందన్నారు. కేసీఆర్ హాయం లో ఇలాంటి నిబంధనలు ఏవైనా ఉన్నాయా ?, వ్యవసాయ రంగం లో కొత్త కొత్త పదవులు ఏర్పాటు చేస్తున్నారు అన్నారు. రైతు రుణమాఫీ చేయని వారికి ఇన్ని పదవులు ఎందుకు ?, రైతుల ఆత్మహత్యలు పెంచడానికా ఈ పదవులు ?, ఇప్పటిదాకా 470మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అన్నారు. రైతుల కోసం బీఆర్ఎస్ తెగించి పోరాడుతుందన్నారు.

Also Read:జర్నలిస్టులు అందరికి ఇళ్ల స్థలాలు: సీఎం రేవంత్

- Advertisement -