చంద్రబాబుపై పవన్ ప్రశంసలు..

2
- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు గుప్పించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మీ మాటలతో మరింత ఉత్తేజాన్ని కలిగించినందుకు చంద్రబాబుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అధికార సంక్షోభం, వ్యవస్థల నిర్వీర్యం, వనరుల దోపిడీ వారసత్వంగా గత ప్రభుత్వం నుండి వచ్చిందన్నారు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మరోవైపు ప్రకృతి వైపరీత్యం, వీటి నడుమ మీ పాలనా దక్ష్యత, విధి నిర్వహణలో మీరు కష్టపడే విధానం స్ఫూర్తిదాయకం, అభినందనీయం అన్నారు. ఇలాంటి సమయంలో మన ప్రజలను ఆదుకోవడం మన ప్రభుత్వంతో పాటుగా వ్యక్తిగత స్థాయిలో నా కనీస బాధ్యతగా భావిస్తున్నాను. సహాయ కార్యక్రమాల్లో పంచాయతీ రాజ్, RWS శాఖలు యుద్దప్రతిపదికన పాల్గొంటున్నారు. త్వరలోనే మనం ఈ సంక్షోభం నుండి బయటపడుతామని ఆశిస్తున్నాను అని తెలిపారు.

Also Read:సిద్దిపేట నుండి ఖమ్మంకు నిత్యావరసర సరుకులు..

- Advertisement -