రైతులకు ఉచితంగా సోలార్ పంప్‌సెట్లు:సీఎం రేవంత్

8
- Advertisement -

రాబోయే రోజుల్లో ఒక బిజినెస్ హబ్‌గా మారబోతున్న తెలంగాణలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన విద్యుత్ అందుబాటులో ఉండేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి విద్యుత్ శాఖపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ రంగం, ప్రజల అవసరాలకు అనుగుణంగా తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు.

రాష్ట్రంలో డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి చేసేందుకు వీలుగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి, వినియోగం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ శాఖల పరిధిలో నిరుపయోగంగా ఉన్న భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నారు. సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించడానికి రైతులకు ఉచితంగా సోలార్ పంప్‌సెట్లు అందజేయాలన్నారు.

అందుకు కొండారెడ్డిపల్లెలో పైలట్ ప్రాజెక్టు చేపట్టామని.. వంటగ్యాస్ బదులుగా సోలార్ విద్యుత్ వినియోగ విధానం తీసుకురావాలన్నారు. ఇందుకు మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వాలని.. అటవీ భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టాలన్నారు. ప్రతీ ఏటా 40వేల మెగావాట్స్ విద్యుత్ అందుబాటులో ఉండే విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలని.. ఓవర్ లోడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం, అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయడం లక్ష్యంగా పనిచేయాలన్నారు రేవంత్.

Also Read:పర్యావరణ పరిరక్షణ కోసం ‘విత్తన గణపతి’: సంతోష్ కుమార్

- Advertisement -