బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 8 గత సీజన్‌ల కంటే భిన్నంగా సాగుతోంది. తొలి రోజు నుండే హౌస్‌లో గొడవలు మొదలు కాగా ఈ సీజన్‌లో కెప్టెన్‌లు ఉండరని బిగ్ బాస్ తొలి రోజు చెప్పగా రెండో రోజు నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగింది. తొలివారం బేబక్క, మణికంఠ, పృథ్విరాజ్, సోనియా, విష్ణుప్రియ, శేకర్ బాషా నామినేట్ కాగా ఇవాళ కూడా నామినేషన్ ప్రక్రియ జరగనుంది.
పుష్ప సినిమా సాంగ్‌తో ఇంటి సభ్యులు నిద్రలేవగా మధ్యాహ్నం మణికంఠ పడుకోవడంతో కుక్క అరుపును బిగ్‍బాస్ ప్లే చేయగా ఇంకోసారి ఇలా పడుకోవద్దని ఇంటి సభ్యులుహెచ్చరించారు. తర్వాత ఇంటి సభ్యులకు పనులను అప్పజెప్పారు ఈ వారం చీఫ్‌లుగా ఉన్న యష్మి, నైనిక, నిఖిల్.
తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలైంది. చీఫ్‍లుగా ఉన్న నిఖిల్, నైనిక, యష్మి గౌడకు బిగ్‍బాస్ హారాలు ఇచ్చి ఈ వారం నామినేషన్ నుండి సేవ్ అయినట్లు తెలిపారు. ఆ తర్వాత ఎవరిని నామినేట్ చేయాలో ఆ శక్తిని చీఫ్‍లకే బిగ్‍బాస్ ఇచ్చారు.
Also Read:Bigg Boss Telugu 8: కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా!
తర్వాత కంటెస్టెంట్లు ఒక్కొక్కరు వచ్చి.. ఇంట్లో ఉండేందుకు అనర్హులు అని ఎవరని అనుకుంటున్నారో ఇద్దరి పేర్లను చెప్పి, అందుకు కారణాలు చెప్పాలని బిగ్‍బాస్ సూచించారు. వారి ఫొటోలను రాయిపై అతికించి, నామినేట్ చేయాలని వివరించారు. ఆ తర్వాత ముగ్గురు చీఫ్‍ల్లో ముందుగా కత్తి తీసుకునే వారు.. కంటెస్టెంట్ చెప్పిన ఆ ఇద్దరిలో ఒకరి ఫొటోపై కత్తిగుచ్చి నామినేట్ చేయాలని చెప్పారు.
బేబక్క, ప్రేరణను సోనియా నామినేట్ చేస్తూ కిచెన్ విషయంలో బేబక్క బాధ్యతరాహిత్యంగా ఉన్నారని చెప్పారు. దీంతో వీరిద్దరి మధ్య పెద్ద గొడవ జరుగగా బేబక్కను నామినేట్ చేశారు యష్మి. నబీల్…మణికంఠ, బేబక్కను నామినేట్ చేయగా మణికంఠ నామినేషన్‍ను యష్మి ఫైనల్ చేశారు. శేఖర్ బాషా..మణికంఠ, బేబక్కను నామినేట్ చేయగా మణికంఠ, శేఖర్ మధ్య పెద్ద గొడవ జరిగింది. నైనిక…మణికంఠ నామినేషన్‌ను ఫైనల్ చేశారు.
తర్వాత బేబక్క..పృథ్విరాజ్, నబీల్‍ను నామినేట్ చేయగా పెద్ద యుద్దమే జరిగింది. ఇక నామినేషన్‌ల ప్రక్రియ ఇవాళ కూడా జరగనుంది. మొత్తంగా తొలివారం ఎలిమినేషన్‍కు బేబక్క, మణికంఠ, పృథ్విరాజ్, సోనియా, విష్ణుప్రియ, శేకర్ బాషా నామినేట్ అయ్యారు.