- Advertisement -
పాలమాకుల గురుకుల విద్యార్థినుల ధర్నాకు దిగివచ్చింది ప్రభుత్వం.10 మందిపై బదిలీ వేటు వేసింది. తమ సమస్యలపై గళం విప్పి జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన కేజీబీవీ విద్యార్థినుల ధర్నాపై ప్రభుత్వం స్పందించింది.
శంషాబాద్ మండలంలోని పాలమాకుల కస్తూర్బా గాంధీ బాలికల గురుకులంలో పనిచేస్తున్న పదిమందిని ఒకేసారి బదిలీ చేశారు. వీరిలో బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారు. పాఠశాల ఎస్ఓతో పాటు ఉపాధ్యాయులను వేరే చోట్లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రంగారెడ్డి జిల్లా పాలమకుల గురుకుల పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, పట్లోల్ల కార్తిక్ రెడ్డి అడిగి తెలుసుకున్న సంగతి తెలిసిందే.
Also Read:ఇదే చిట్టచివరి హెచ్చరిక..ప్రకృతి చెబుతుంది ఇదేనా!
- Advertisement -