- Advertisement -
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్ కి బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. విజయ్ నాయర్ తరపున వాదనలు వినిపించారు తెలంగాణ కాంగ్రెస్ రాజ్య సభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి.
ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం బెయిల్ మంజూరు చేసింది జస్టిస్ హ్రిషికేశ్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం. లిక్కర్ కేసులో సుదీర్ఘంగా అండర్ ట్రయల్ ఖైదీగా ఉండటంతో బెయిల్ కి అర్హుడని తెలిపింది సుప్రీంకోర్టు. లిక్కర్ కేసులో ఇప్పటికే మనీష్ సిసోడియా,కవితకు బెయిల్ వచ్చినట్లు సుప్రీంకోర్టుకి తెలిపారు సింఘ్వి.
Also Read:హైడ్రా కోసం రంగంలోకి సినీ నటులు!
- Advertisement -