- Advertisement -
ఇప్పటికే ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఏపీ అతలాకుతలంగా మారింది. ముఖ్యంగా విజయవాడ జలదిగ్బందంలో చిక్కుకుపోగా వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్తను తెలిపింది. ఈ నెల 6, 7 తేదీల్లో ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
రెండు రోజుల్లో తుపాను ముప్పుకు సంబంధించిన క్లారిటీ రానుందని వాతావరన శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయి. విజయవాడ, గుంటూరులో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ముంపు ప్రభావిత ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
భారీ వర్షాలతో హైదరాబాద్ – విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
Also Read:భారీ వర్షాలు..86 ట్రైన్స్ రద్దు
- Advertisement -