వన మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని, శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలయ్యే కార్యక్రమంలో విధిగా పాల్గొనాలని ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖామాత్యులు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పచ్చదనంతో రాష్ట్రమంతా కళకళలాడాలని, అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. శుక్రవారం వనమహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్న వేళ శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకు వీడియో ద్వారా సందేశం అందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29 శాతం మాత్రమే పచ్చదనం ఉంది. విరివిగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడం ద్వారా, వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో 50 శాతానికి పచ్చదనం పెరగాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోండి. మొక్కల పెంపకం అనేది ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యేది కాదు. ప్రతి ఒక్కరూ తమకు అనువైన ప్రదేశాల్లో మొక్కలను నాటి, వాటి పెరుగుదలకు తగిన బాధ్యత తీసుకోవాలన్నారు.
దేశీయ మొక్కల పచ్చదనంతో రాష్ట్రం కళకళలాడాలన్నారు. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి… ఇది సామాజిక బాధ్యత అన్నారు పవన్. అన్య జాతుల మొక్కలను పెంచడం మానేద్దాం అని, దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలు అన్నారు.
దేశీయ మొక్కల పచ్చదనంతో రాష్ట్రం కళకళలాడాలి
•వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి… ఇది సామాజిక బాధ్యత
•అన్య జాతుల మొక్కలను పెంచడం మానేద్దాం
•దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలు
•వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ… pic.twitter.com/0PWGVAaeID
— JanaSena Party (@JanaSenaParty) August 30, 2024
Also Read:ఉద్వేగం.. టీజర్