వైసీపీకి ,ఎంపీ పదవికి మోపిదేవి-మస్తాన్ రావు రాజీనామా

11
- Advertisement -

వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీ పార్టీకి ,ఎంపీ పదవులకు రాజీనామా చేశారు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు. ఈ మేరకు తమ రాజీనామా లేఖను పార్టీ కార్యలయానికి పంపారు. అలాగే రాజ్యసభ ఛైర్మన్‌కు కలిసి ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. త్వరలోనే వీరిద్దరూ టీడీపీలో చేరనున్నారు.

తాము టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు మోపిదేవి. అధికారం తనకు కొత్త కాదని, గతంలో ఎన్నో పదవుల్లో పనిచేశానని తెలిపారు. ఏడాది కాలంగా వైసీపీలో ఇబ్బందులు పడుతున్నానని చెప్పారు. ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చిన జగన్‌లో మార్పు రాలేదన్నారు.

ఇప్పటికే చాలామంది నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. లోపం ఎక్కడ ఉందో వైసీపీ నేతలు విశ్లేషించుకోవాలని, సీఎం చంద్రబాబు అనుభవం ఉన్న నేత అన్నారు. రాష్ట్రాన్ని ఆయన గాడిలో పెడుతున్నారని తెలిపారు. టీడీపీలో సముచిత స్థానం దక్కుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు.

Also Read:KTR:రుణమాఫీకి వంద కొర్రీలు

- Advertisement -