హైదరాబాద్ వరకే హైడ్రా: సీఎం రేవంత్ రెడ్డి

7
- Advertisement -

ప్రస్తుతానికి హైడ్రాను హైదరాబాద్ వరకే పరిమితం చేస్తున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలన్నారు. మొదటగా మా పార్టీకి చెందిన పళ్ళం రాజు ఫామ్ హౌజ్ హైడ్రా కూల్చిందని…చెరువు శిఖం భూముల్లో నిర్మాణాలు చేపట్టవద్దు అని సూచించారు.వ్యవసాయం చేసుకుంటే ఇబ్బంది లేదు అన్నారు.

FTL , బఫర్ జోన్, పార్కులు, నాలల కబ్జాల పైన చర్యలే మా మొదటి ప్రాధాన్యం అని తేల్చిచెప్పారు. చెరువులు కబ్జా చేసిన ఎవరినీ వదిలి పెట్టం అని..జంట జలాశయాలను పరిరక్షించడమే మా భాద్యత అన్నారు సీఎం రేవంత్.

FTL బఫర్ జోన్ లో నా కుటుంబ సభ్యులు, బంధువుల భవనాలు ఉంటే వివరాలు ఇవ్వండి నేనే దగ్గరుండి కూల్చివేపిస్తా అన్నారు.

Also Read:KTR:రాజీవ్ గాంధీపై రేవంత్‌ది కపట ప్రేమ

- Advertisement -