ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ లభించిన ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2:45 గంటలకు ఢిల్లీ నుండి శంషాబాద్ విమానాశ్రయానికి కేటీఆర్, హరీష్ రావులతో పాటు కవిత చేరుకోనున్నారు.
దాదాపు 165 రోజుల తర్వాత ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్ ఇచ్చింది. బెయిల్ కోసం రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలని సూచించింది. సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. సెక్షన్ 45 అనేది దుర్బల మహిళలకు మాత్రమే వర్తిస్తుందన్నట్లు హైకోర్టు జడ్జి వ్యవహరించారని పేర్కొంది. సెక్షన్ 45పై కోర్టులు సున్నితంగా వ్యవహరించాలని చెప్పింది.
పాస్‌పోర్టును మెజిస్ట్రేట్‌కు సరెండర్ చేయాలని… విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని న్యాయస్థానం తెలిపింది. కేసు ట్రయల్‌కు సహకరించాలని.. విచారణ వాయిదాల సమయంలో దర్యాప్తు సంస్థలకు సహకరించాలని తెలిపింది.
Also Read:KTR: బండి సంజయ్‌పై సుప్రీం కోర్టుకు కేటీఆర్