ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఆలస్యమైన న్యాయమే గెలిచిందని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని మండిపడ్డారు.
ఇక బెయిల్ సందర్భంగా సుప్రీం కోర్టు పలు కండీషన్స్ పెట్టింది. సెక్షన్ 45 ప్రకారం బెయిల్ పొందేందుకు కవిత అర్హురాలని తెలిపింది. సీబీఐ ,ఈడీ రెండు కేసుల్లో బెయిల్ లభించగా రూ. 10 లక్షల పూచీకత్తు సమర్పించాలని తెలిపింది న్యాయస్థానం. అలాగే దేశం విడిచి వెళ్లాలంటే అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, సాక్ష్యులను ప్రభావితం చేయకూడాదని తెలిపింది. ఇక ఈ కేసులో ఇప్పటికే ఛార్జీషిట్ దాఖలు చేసిన నేపథ్యంలో బెయిల్ ఇవ్వకూడదనేది సరికాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టగా కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి…ఈడీ, సీబీఐ తరపున అడిషనల్ సొలిసిటరీ జనరల్ ఎస్వీ రాజు, డిపి సింగ్ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
Also Read:బ్రేకింగ్..MLC కవితకు బెయిల్