మహిళలంటే తనకు గౌరవం ఉందని అందుకే విచారణకు వచ్చానని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరైన అనంతరం మాట్లాడిన కేటీఆర్..కాంగ్రెస్ నేతలు కమిషన్ కార్యాలయం ముందు రాజకీయం చేశారన్నారు. రాష్ట్రంలోని సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.
వసతి గృహాల్లో పిల్లల ఇబ్బందులు, మహిళలపై దాడులు జరుగుతున్నాయన్నారు. విచారణ సందర్భంగా కేటీఆర్‌కు మహిళ కమిషన్ సభ్యులు రాఖీలు కట్టారు.
కేటీఆర్ మహిళా కమిషన్ ముందుకు రాగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మహిళా కార్యకర్తలు పోటాపోటీగా నిరసనలు, నినాదాలకు దిగారు. కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా.. సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది.
షాద్ నగర్లో దళిత మహిళపై, కొల్లాపూర్లో ఒక చెంచు మహిళపై జరిగిన అఘాయిత్యాలపై, రాష్ట్రంలోని హాస్టల్లలో, వసతి గృహాల్లో పిల్లల పరిస్థితి బాలేదు అని చెప్తుంటే మహిళా కమిషన్ చైర్మన్ గారు ఇంకో రూపంలో రండి సమయం ఇస్తాము అప్పుడు అన్ని చెప్పండి అని చెప్పారు..
భవిష్యత్తులో తప్పకుండా మా పార్టీ… pic.twitter.com/pIeqPjU8Vw
— Telugu Scribe (@TeluguScribe) August 24, 2024