105 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న మయన్మార్ మిలటరీ విమానం సముద్రంలో కూలిపోయిందని అధికారులు ప్రకటించారు. ఆ తరువాత అండమాన్ సముద్రంలో దాని శకలాలను గుర్తించినట్లు ఎయిర్స్‌ఫోర్స్ అధికారులు వెల్లడించారు. గాలింపు చర్యల్లో పాల్గొన్న నావికా దళ బృందం.. డవేయి పట్టణానికి 218 కి.మీ.ల దూరంలో వీటిని గుర్తించిందని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపాయి.
అయితే యాంగాన్ నగరానికి పయనమైన వై-8-200ఎఫ్ విమానం.. అండమాన్ సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో అదృశ్యమైందని ఆ దేశ సైన్య అధికారులు తెలిపారు. విమానంలో సైనికులు, వారి కుటుంబ సభ్యులు, 14 మంది విమాన సిబ్బంది ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటు ప్రయాణికుల సంఖ్య విషయంలో అయోమయం కొనసాగుతోంది. అంతకుమందు విమానంలో 120 మంది ప్రయాణికులున్నట్లు అధికారులు ప్రకటించారు.
దక్షిణకోస్తా ప్రాంతంలోని మయీక్ పట్టణం నుంచి మధ్నాహ్నం ఒంటి గంట తర్వాత విమానం బయల్దేరిందని, అరగంట తర్వాత డవేయి పట్టణానికి పశ్చిమంగా 70కి.మీ.ల దూరంలో ఉండగా గగనతలరద్దీ నియంత్రణ కేంద్రంతోసంబంధాలు కోల్పోయిందని అధికారులు పేర్కొన్నారు. విమానం టేకాఫ్ అయినప్పుడు వాతావరణ పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయన్నారు.
ఆ విమానం కూలిపోయింది…119 మంది దుర్మరణం
- Advertisement -
- Advertisement -