సీఎం రేవంత్ కు దమ్ముంటే… “చలో ఢిల్లీ” కాదు.. “చలో పల్లె” చేపట్టాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్..రుణమాఫీ కాక లక్షలాది రైతులు రగిలిపోతుంటే.. వారివైపు కన్నెత్తి కూడా చూడకుండా హస్తిన యాత్రలా..?? అని ప్రశ్నించారు. ఒకటి కాదు.. రెండుకాదు.. ఎనిమిది నెలల్లో..ఏకంగా 20 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడతారా..?? రిమోట్ కంట్రోల్ పాలనతో రైతులను బలి చేస్తారా..?? అని దుయ్యబట్టారు.
రైతులకేమో మాయమాటలు..ఢిల్లీ పెద్దలకు మాత్రం మూటలా?? ,20 సార్లు చేపట్టిన ఢిల్లీ యాత్రలతో తెలంగాణకు దక్కింది.. గుండుసున్నా అని మండిపడ్డారు కేటీఆర్.
సీఎం రేవంత్ కు దమ్ముంటే…
“చలో ఢిల్లీ” కాదు.. “చలో పల్లె” చేపట్టాలి..రుణమాఫీ కాక లక్షలాది రైతులు రగిలిపోతుంటే.. వారివైపు కన్నెత్తి కూడా చూడకుండా హస్తిన యాత్రలా..??
ఒకటి కాదు.. రెండుకాదు.. ఎనిమిది నెలల్లో..ఏకంగా 20 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడతారా..??
రిమోట్ కంట్రోల్…— KTR (@KTRBRS) August 23, 2024
Also Read:పైథాన్‌తో గుండె జబ్బులకు చెక్!