సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్, బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడి చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు.
కాంగ్రెస్ పిట్ట బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదని అన్నారు. నాయకులు, కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కారు అద్దాలు ధ్వంసం చేసి రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
కారు అద్దాలు ధ్వంసం చేసి రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేయటం… pic.twitter.com/32URohW7Sj
— Harish Rao Thanneeru (@BRSHarish) August 22, 2024
Also Read:Niranjan Reddy:రైతులను రోడ్లపైకి తీసుకొచ్చిన కాంగ్రెస్