KTR:ఢిల్లీ గులాములు తెలంగాణ ఖ్యాతిని అర్ధంచేసుకోలేరు

4
- Advertisement -

ఢిల్లీ గులాములు తెలంగాణ ఖ్యాతిని అర్ధం చేసుకోలేరని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటకే కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్.. తాము అధికారంలోకి వచ్చిన తొలిరోజే బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ సచివాలయం పరిసరాల్లోని చెత్తను తొలగిస్తామని విమర్శించారు. చిన్న పిల్లల ముందు చెత్త మాటలు మాట్లాడిన రేవంత్‌ రెడ్డి నైజం, వ్యక్తిత్వం ఆయన పెంపకాన్ని సూచిస్తుందని అన్నారు.

రాష్ట్రంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయో వివరించేందుకు ఇవే తార్కాణాలు అని విమర్శించారు. ఇందుకు సంబంధించి రెండు ఫొటోలను షేర్ చేసిన కేటీఆర్… నిజామాబాద్‌లో పోలీసుల వేధింపులతో విసుగుచెందిన ఓ స్వీట్‌ షాపు యజమాని తన దుకాణాన్ని మూసివేస్తూ ఒక బ్యానర్‌ పెట్టారని తెలిపారు. ఒకవైపు ఇలా నిజామాబాద్‌లో చిన్న వ్యాపారులను వేధించడంలో బిజీగా ఉంటే.. మరోవైపు వరంగల్‌లోని రద్దీ రహదారిపై నిర్వహించిన కాంగ్రెస్‌ మంత్రి కొండా సురేఖ పుట్టిన రోజు వేడుకల్లో ఏసీపీ పాల్గొన్నారని వెల్లడించారు. ఈ వేడుకల్లో క్రాకర్స్‌ కాల్చడం వల్ల అమాయకులు గాయపడ్డారని మండిపడ్డారు.

 

Also Read:Rahul Gandhi:మీరే నా స్పూర్తి..రాజీవ్‌కు ఘన నివాళులు

- Advertisement -