మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అత్యద్భుతమైన గ్రాండియర్‌తో నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఇందులో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించింది.
ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ఈ చిత్ర స్ట్రీమింగ్ ఎప్పుడు అన్నది తెలియరాలేదు.
తాజాగా ఏదైనా సినిమా విడుదలైన తర్వాత నాలుగు వారాల్లో ఓటీటీలోకి వస్తుంది. అయితే మిస్టర్ బచ్చన్‌కు సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఆనంద్ బచ్చన్ (రవితేజ) పని చేస్తుంటాడు. అతడు ఓ సిన్సియర్ ఆఫీసర్. ఓ వ్యక్తి ఇంట్లో రైడ్ చేసి నల్లధనాన్ని పట్టుకుంటాడు. సీన్ కట్ చేస్తే జిక్కితో ప్రేమలో పడతాడు. వీరిద్దరు పెళ్లికి సిద్ధమవుతుండగా ఆనంద్‌కు ఉద్యోగం తిరిగి వస్తోంది. తర్వాత రైడ్ లో జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు ? అక్కడ నల్లధనం దొరికిందా? అన్నదే సినిమా కథ.
Also Read:‘ఆయ్’ పెద్ద హిట్ కావాలి: నిఖిల్