డయాబెటిస్‌తో ఇన్ని సమస్యలా!

9
- Advertisement -

నేటిరోజుల్లో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ సమస్య అన్నీ వయసుల వారిని వేధిస్తోంది. ఒక్కసారి మధుమేహం బారిన పడితే దానినుంచి బయటపడడం అంతా తేలికైన విషయం కాదు. అందుకే చక్కెర వ్యాధి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు. అయితే మధుమేహ సమస్య పురుషులతో పోల్చితే మహిళల్లోనే ఎక్కువ అని పలు అద్యయానాలు చెబుతున్నాయి. నెలసరి టైమ్ లో వచ్చే ఆరోగ్య మార్పులు, గర్భధారణ సమయంలో వచ్చే శారీరక మార్పులు.. ఇలా పలు కారణాల వల్ల మహిళలే మధుమేహం బారిన ఎక్కువగా పడుతున్నట్లు వెల్లడింది.

ఇంకా మహిళల్లో ఈస్ట్రోజన్ అసమతుల్యత, రోగనిరోధక శక్తి లోపించడం, ఐరన్ లోపం వంటివి కూడా స్త్రీలలో డయాబెటిస్ పెరఫడానికి కారణాలుగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి చక్కెర వ్యాధి విషయంలో మహిళలే ఎక్కువ జాగ్రత్త పాటించాలట. మహిళల్లో చక్కెర వ్యాధి ఉంటే ప్రెగ్నెన్సి కష్టమౌతుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ గర్భం దరించిన గర్భస్రావం కావడం, శిశువు నెలలు నిండకుండానే పుట్టడం, పిట్టిన పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు తలెత్తడం.. వంటి సమస్యలు ఏర్పడతాయి.

ఇంకా మహిళల్లో డయాబెటిస్ కారణంగా హార్మోన్ల అసమతుల్యత, నరాల బలహీనత, రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వంటి ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఇంకా డయాబెటిస్ కారణంగా మహిళల్లో చూపు మందగించడం, కిడ్నీ సమస్యలు, డిప్రెషన్ వంటివి కూడా వేదిస్తాయట. అందుకే మహిళలు ఎప్పటికప్పుడు చక్కెర వ్యాధిని చెక్ చేసుకుంటూ తగిన జాగ్రత్తలు పాటించడం ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

Also Read:పిస్తాపప్పు తింటే ఎన్నిలాభాలో తెలుసా?

ఆరోగ్యకరమైన జీవనం కోసం చక్కెరలను తీసుకోవడం తప్పనిసరిగా నియంత్రించాలి. ఫైబర్ ఫుడ్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక రోగాల నుండి బయటపడవచ్చు. అలాగే ప్యాక్ చేసిన ఆహారాలు మరియు పానీయాల్లో అధికమొత్తంలో చక్కెర స్థాయి ఉండే అవకాశం ఉంది కాబట్టి వీటిని అదుపులో ఉంచుకుంటేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -