వీక్ష‌ణం..ఫ‌స్ట్ లుక్

8
- Advertisement -

యువ క‌థానాయ‌కుడు రామ్ కార్తీక్, క‌శ్వి జంట‌గా రూపొందుతోన్న చిత్రం ‘వీక్ష‌ణం’. ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై మ‌నోజ్ ప‌ల్లేటి ద‌ర్శ‌క‌త్వంలో పి.ప‌ద్మ‌నాభ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ ఆదివారం విడుద‌ల చేశారు. చిమ్మ‌చీక‌టిలో బైనాకుల‌ర్స్ నుంచి వ‌స్తోన్న కాంతిలో హీరో రామ్ కార్తీక్ నిలుచుకుని ఉన్నారు. పోస్ట‌ర్‌తోనే మేక‌ర్స్ సినిమా కంటెంట్ డిఫ‌రెంట్‌గా ఉండ‌బోతుంద‌నే న‌మ్మ‌కాన్ని క్రియేట్ చేశారు.

ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ఫస్ట్ కాపీ కూడా సిద్ధమైంది. సాయిరామ్ ఉద‌య్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి స‌మ‌ర్ధ్ గొల్ల‌పూడి సంగీతాన్ని అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను అందిస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.

బ్యానర్ పేరు : పద్మనాభ సినీ ఆర్ట్స్, నిర్మాత : P. పద్మనాభ రెడ్డి, దర్శకుడు : మనోజ్ పల్లేటి, సినిమాటోగ్రఫీ : సాయి రామ్ ఉదయ్ (D.F Tech), సంగీత దర్శకుడు : సమర్థ్ గొల్లపూడి, ఎడిటింగ్ : జెస్విన్ ప్రభు, పి.ఆర్‌.ఒ: నాయుడు సురేంద్ర కుమార్‌- ఫ‌ణికందుకూరి (బియాండ్ మీడియా).

Also Read:నాని.. ‘సరిపోదా శనివారం’ ట్రైలర్

- Advertisement -